విషయానికి వెళ్ళండి

మనసా..మనసా.. రామచంద్రుని మదినదలచవే ! నీ మందకుటిల దుర్గుణములు మానవదేమే !!?? bhajan

కలియుగాంతం కాదు!

కలియుగాంతం కాదు!

మాయన్ క్యాలెండర్‌లో చెప్పినట్లు ఈ నెలలో యుగాంతం అయిపోతుందా? లేక హిందూ పురాణాలలో చెప్పిన మాదిరిగా మరో 4.25 లక్షల ఏళ్లు ఈ కలియుగమే కొనసాగుతుందా? ఈ విషయంపై బ్రహ్మం గారి కాలజ్ఞానం ఏం చెప్పింది? – ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతో డాక్టర్ కోరాడ ప్రభాకర్ ఇంగ్లీషులో రాసిన పుస్తకమే – ” 2012 ఈజ్ నాట్ ద ఎండ్, ప్రాఫసీస్ ఆఫ్ ఎ హిందూ సేజ్”. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర, ఆయన చెప్పిన కాలజ్ఞానంతో పాటు హిందూ ధర్మానికి సంబంధించిన అనేక అంశాలను ప్రభాకర్ ఈ పుస్తకంలో ప్రస్తావించారు. మన రాష్ట్రంలో విశేషంగా ప్రచారంలో ఉన్న బ్రహ్మం గారి కాలజ్ఞానం ఇంగ్లీషులో రావటం ఇదే తొలిసారి. ఈ పుస్తకంలోని కొన్ని ఆసక్తికరమైన భాగాలు మీ కోసం..

దాదాపు ఐదు వేల ఏళ్ల క్రితం వేదవ్యాసుడు కలియుగంలో మానవులు అర్థం చేసుకోవటానికి వీలుగా జ్ఞానాన్ని నాలుగు వేదాలుగా వర్గీకరించాడు. కలియుగంలో మానవులు అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు కాబట్టి వాటికి ఈ వేదాలలో పరిష్కారమార్గాలు సూచించాడు. వేదవ్యాసుడు భారతాన్ని కూడా రాశాడు. భారతంలోని భగవద్గీతలో ఉపనిషత్తుల సారమంతా ఉంటుంది. వ్యాసుడు భారతంతో పాటు 18 పురాణాలను కూడా రాశాడు. వీటిలో భవిష్య పురాణం కూడా ఒకటి. దీనినే కల్కి పురాణం అని కూడా అంటారు. పురాణము అంటే చరిత్ర అని అర్థం.

జరగబోయేదాన్ని భవిష్యత్తు అంటారు. అందుకే వ్యాసుడు భవిష్య పురాణంలో భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పాడు. ఈ పురాణంలో క్రైస్తవ, ఇస్లాం మత వ్యవస్థాపకుల గురించి, వారి పుట్టుపూర్వోత్తరాల గురించి వివరించాడు. ఆకాశం నుంచి గుర్రం మీద కత్తి పట్టుకొని కల్కి భూమిపైకి రావటంతో ఈ పురాణం పూర్తవుతుంది. కల్కిని విష్ణువు పదో అవతారంగా చెబుతారు. మానవులను ఇబ్బంది పెట్టేవారందరిని సంహరించి, వేద సూత్రాల ఆధారంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయటమే కల్కి లక్ష్యం. ఈ క్రమంలో కల్కి అనేక మందితో యుద్ధాలు చేస్తాడు. బౌద్ధమతంపై విశ్వాసం లేని బౌద్ధులతో కూడా పోరాడతాడు. ఈ యుద్ధంలో అనేక వేల మంది భారతీయులు మరణిస్తారు. విజయం కల్కినే వరిస్తుంది. హిందు ధర్మ శాస్త్రాలలోని యుగ సిద్ధాంతం ప్రకారం ప్రస్తుతం కలియుగం నడుస్తోంది. ఇది మరొక 4.27 లక్షల ఏళ్లు ఉంటుంది.

కలియుగం చివర్లో భారతీయులను రక్షించటానికి కల్కి మళ్లీ భూమిపైకి వస్తాడు. అయితే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తాను కల్కి అంశతో వీరభోగ వసంతరాయుల రూపంలో ఆకాశాన్ని చీల్చుకొని భూమిపైకి వస్తానని 350 ఏళ్ల క్రితం పేర్కొన్నాడు. అంటే కలియుగం అనేది ఐదు వేల ఏళ్ల తర్వాత అంతం అయిపోతుందా? లేకపోతే భూమిపై ఉన్న మంచి వ్యక్తుల కోసం మరి కొంత కాలం ఉంటుందా? అనే విషయాన్ని బ్రహ్మంగారు స్పష్టంగా చెప్పలేదు. అయితే మన పురాణాల ఆధారంగా చూస్తే- మానవుల పాపాలను భరించలేకపోతున్నానని భూదేవి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి మొర పెట్టుకుంటుంది. అప్పుడు తాను ఊహించిన దానికన్నా ముందే భూమిపైకి వస్తానని.. కృతయుగ ధర్మాన్ని స్థాపిస్తానని భూదేవికి వరం ఇస్తాడు. కాని ఎంత త్వరగా వస్తాడనే విషయాన్ని మాత్రం వెల్లడించడు.

[andhrajyothy.com]

కోదండ రామా !పాహి ! కోదండరామా ! [bhajan]

సర్పం కుండలినికి సంకేతం

సర్పం కుండలినికి సంకేతం

సాధకుడు: సద్గురూ, మన సంస్కృతిలో పాములు, వాటి విగ్రహాలూ పూజింపబడుతున్నాయి. అలాగే యోగాలో కూడా ఇవి ఎంతో ముఖ్యమయిన భూమికను పోషిస్తున్నాయి. కాని పశ్చిమ దేశాల సంస్కృతిలో పాముల్ని దెయ్యంగా, దైవ విరుద్ధమైన వాటిగా పరిగణిస్తారు. ఈ విషయం గురించి వివరించవలసినదిగా కోరుచున్నాను.

సద్గురు: మనం ఇంతకుముందే చాలాసార్లు పాముల గురించి, వాటి ప్రాధాన్యత గురించి మాట్లాడుకున్నాం. ఒకవిధంగా చూస్తే, ఇది ‘కుండలినికి’ సంకేతం, ఎందుకంటే పాములుండే విధానం, వాటి ప్రవర్తన, పాముల ప్రత్యేకమైన కదలిక, నిశ్చలత్వం కుండలినిలా ఉండటం వల్ల అది కుండలినికి సంకేతం అయి ఉండవచ్చు. జీవపరిణామ క్రమంలో ‘శారీరకం’గా కోతి ప్రముఖ స్థానంలో ఉంటుంది. అలాగే జీవ పరిణామక్రమంలో ‘శక్తి’పరంగా పాము విశిష్ట స్థానంలో ఉంటుంది. అందుకే ఈ సంస్కృతిలో మీరు పాముని చంపడం నిషిద్ధం. భారతదేశంలో మీరొక పాముని చంపినా, ఓ పాము మృతదేహాన్ని చూసినా దానికి అంతిమ సంస్కారం చేయడం ఆనవాయితీ. మీకు ఈ విషయం తెలియకపోతే తెలుసుకోండి.

ఎందుకంటే జీవపరంగా మనిషికి పాముకి ఎంతో సన్నిహితమైన సంబంధం ఉండటం వల్ల, పాము ఎప్పుడూ పక్రమమైన అంతిమ సంస్కారాన్ని పొందుతూ ఉంది. మనిషిని ఖననం చేసినట్లే అది కూడా ఖననం చేయబడుతుంది. అందువలన ఒక పాముని చంపడం అందే అది హత్యతో సమానం. అలాగే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. పాములెప్పుడూ నా చుట్టూ ఉంటాయి. నా తోటలో చాలా పాములున్నాయని, అది పాములతో నిండి ఉందని, మీకు విషయం తెలుసా! ప్రత్యేకించి అందర్నీ భయపెట్టే నా ఆప్తమిత్రుడి గురించి చాలామంది ప్రజలు ఫిర్యాదు చేస్తుంటారు. అతను చాలా పెద్దవాడు, ఎంతో అందంగా ఉంటాడు కాని ఎవ్వరూ అతని అందాన్ని గమనించడం లేదు. అందరూ అతనెంత పెద్దవాడు అనే విషయాన్నే పట్టించుకుంటారు(నవ్వులు).

జీవరాశి అభివృద్ధికి హేతువు
పాశ్చాత్య దేశాల్లో పాముల గురించి వ్యతిరేక భావం ఉందంటే అది కేవలం క్రైస్తవ మత సాంప్రదాయంలో కొన్ని నిర్దిష్టమైన అంశాలలో, పాముల గురించి చాలా అవాస్తవంగా వివరించటం మూలానే ఒకవేళ పాముని దెయ్యానికి ప్రతినిధిగా, అదొక వ్యతిరేక శక్తిగా వాళ్లు భావిస్తున్నారంటే-అందుకు కారణం, పాము ఈవ్‌ని యాపిల్ పండు తినేందుకు ప్రోత్సహించిన కారణం అయి ఉండవచ్చు. ఈ భూమి మీద ఇద్దరు మూర్ఖులు ఉన్నారు..ఆడమ్, ఈవ్‌లు. వాళ్లకి కనీసం తమకి తాము ఏమి చేసుకోవాలో కూడా తెలియదు. వారికి జ్ఞానం, స్వేచ్ఛలు లేవు. అట్టి పరిస్థితులలో జీవం కొనసాగే అవకాశమే లేదు.

అప్పుడు పాము అక్కడ ప్రవేశించి ఈవ్‌ని ప్రలోభపరచి యాపిల్ తినేలా చేసి ఈ భూమి మీద జీవం కొనసాగేలా చేసింది. మీరు ఈ భూమి మీద జీవరాశి దేవుని సృష్టి అని నమ్ముతున్నట్లైతే పాము ఈ భూమి మీద జీవరాశి అభివృద్ధికి దేవుని ప్రతినిధి అని తెలిస్తే, మీరు ఇప్పుడు పాము దేవుని ప్రతినిధా లేక దెయ్యం ప్రతినిధా చెప్పండి?(నవ్వులు). అది తప్పక దేవుడి ప్రతినిధే! అవునా, కాదా? ఈ భూమి మీద జీవరాశి పెంపొందటానికి తోడ్పడినది కచ్ఛితంగా దేవుడి ప్రతినిధే. జీవన ప్రక్రియకు పూర్తిగా వ్యతిరేకులుగా ఉన్నవారు, జీవన ప్రక్రియ గురించిన కనీస అవగాహన కూడా లేని మూర్ఖులు-ప్రాథమిక శరీర నిర్మాణం గురించి కూడా తెలియనటువంటి వారు, భూమి మీద జీవకోటి అభివృద్ధి చెందడానికి తోడ్పడిన పాముని దెయ్యం ప్రతినిధి అంటారు. నిజంగా జీవిస్తున్న ఎవరైనా, కచ్ఛితంగా పాముని దేవుడి ప్రతినిధిగానే గ్రహిస్తారు.

దేవుని ప్రతినిధి
ఇక్కడ ఈ సంస్కృతిలో దాన్ని మేము ఒక దేవుని ప్రతినిధిగానే చూస్తాం. శివుడంతటివాడే పాముల్ని ధరించాడు, పాదాల వద్ద కాదు తన తలపై. జీవ ఉద్భవ ప్రక్రియలో, మానవ జీవితంలో, మానవ అవకాశాలలో పాము చాలా ప్రాధాన్యతను కలిగి ఉంది. అందుకే ఈ సంస్కృతిలో మీరు ఏ గుడికి వెళ్లినా అక్కడ పాములుంటాయి. నాకు తెలిసినంత వరకూ ఒక పామైనా లేని గుడి అంటూ ఉండదు. ప్రతి గుడిలో ఎక్కడో ఒక చోట ఒక చిన్న పామైనా ఉంటుంది. కాని అన్ని ప్రాచీన దేవాలయాల్లో పాములున్నాయి.

కొత్తగా కట్టిన కొన్ని దేవాలయాలు షాపింగ్ కాంప్లెక్సులులా ఉన్నాయి. బహుశా అవి దానికే ఉద్దేశించినవేమో! అక్కడ పాములు ఉండకపోవచ్చు, కాని మీరు ఏ పురాతన దేవాలయాన్ని సందర్శించినా అక్కడ పాముల కోసం ప్రత్యేకంగా ఓ స్థానం ఉంటుంది. ఎందుకంటే అది జీవ పరిణామక్రమంలో చాలా ముఖ్యమైన మలుపు, అది జీవం ప్రేరేపణ చేసింది. మనకిక్కడ ఈషాలో అది చాలా ప్రధానమైంది. వాటిలో కొన్నిటి గురించి మీకు తెలుసు. కొన్నిటి గురించి మీరు ఇంకా తెలుసుకోవాలి. పాముల గురించి ఎక్కువగా మాట్లాడితే ప్రజలు అపార్థం చేసుకుంటారు. నాకయితే అవి ఎప్పుడూ నా చుట్టూ ఉంటేనే ఇష్టం. వాటితో ఉండటం నాకు చాలా హాయిగా ఉంటుంది. ం సద్గురు

శ్రీవారిసేవలో కోయల నృత్యం

 అక్టోబర్ నెలలో   శ్రీవారి సేవకు వెళ్ళినప్పుడు   దాదాపు నాలుగువందలమంది కోయలు  శ్రీవారి సేవకై వచ్చారు అని గతపోస్ట్ లో చెప్పాను. అపర హనుమంతులవలే వారు చేస్తున్న సేవ చూస్తే అసలు భక్తి ఎక్కడఉందో తెలిసింది.  నేను వారిని పరిచయం చేసుకోవటానికి వారి బసకు వెళ్ళినప్పుడు   వారంతా ఇలా నృత్యం చేస్తూ ఆనందంతో తన్మయులవుతున్నప్పుడు ఈ  దృశ్యం సెల్ లో చిత్రీకరించారు మాకార్యకర్త ఒకరు.

రామక్రిష్ణ హరి….ముకుందా మురారీ ! పాండురంగపాండురంగా ! [bhajan]

పై లింక్ లో  share  పై క్లిక్ చేసి డైరెక్ట్ గా డౌన్ లోడ్ చేసుకోవచ్చు

భగవంతునికి ఆగ్రహమా ?!!!!!!

భగవంతునికి ఆగ్రహమా  ? అంటూ  ఓభక్తుడు  ఆవేదనతో తపించి  తన మనసులో దర్శించిన సత్యాన్ని మనముందు అద్భుతంగా ఆవిష్కరించారు. సనాతనమైన ఈ ధార్మికజీవధారలో బిందువులుగా ఉన్న మనందరం తప్పక తెలుసుకోవలసిన విషయములివి  ఈలింక్ లో  చదువగలరు

https://docs.google.com/open?id=0BwzNHG3zT3WrQjI0SG0tUUxUUTg