విషయానికి వెళ్ళండి

సర్పం కుండలినికి సంకేతం

డిసెంబర్ 5, 2012

సర్పం కుండలినికి సంకేతం

సాధకుడు: సద్గురూ, మన సంస్కృతిలో పాములు, వాటి విగ్రహాలూ పూజింపబడుతున్నాయి. అలాగే యోగాలో కూడా ఇవి ఎంతో ముఖ్యమయిన భూమికను పోషిస్తున్నాయి. కాని పశ్చిమ దేశాల సంస్కృతిలో పాముల్ని దెయ్యంగా, దైవ విరుద్ధమైన వాటిగా పరిగణిస్తారు. ఈ విషయం గురించి వివరించవలసినదిగా కోరుచున్నాను.

సద్గురు: మనం ఇంతకుముందే చాలాసార్లు పాముల గురించి, వాటి ప్రాధాన్యత గురించి మాట్లాడుకున్నాం. ఒకవిధంగా చూస్తే, ఇది ‘కుండలినికి’ సంకేతం, ఎందుకంటే పాములుండే విధానం, వాటి ప్రవర్తన, పాముల ప్రత్యేకమైన కదలిక, నిశ్చలత్వం కుండలినిలా ఉండటం వల్ల అది కుండలినికి సంకేతం అయి ఉండవచ్చు. జీవపరిణామ క్రమంలో ‘శారీరకం’గా కోతి ప్రముఖ స్థానంలో ఉంటుంది. అలాగే జీవ పరిణామక్రమంలో ‘శక్తి’పరంగా పాము విశిష్ట స్థానంలో ఉంటుంది. అందుకే ఈ సంస్కృతిలో మీరు పాముని చంపడం నిషిద్ధం. భారతదేశంలో మీరొక పాముని చంపినా, ఓ పాము మృతదేహాన్ని చూసినా దానికి అంతిమ సంస్కారం చేయడం ఆనవాయితీ. మీకు ఈ విషయం తెలియకపోతే తెలుసుకోండి.

ఎందుకంటే జీవపరంగా మనిషికి పాముకి ఎంతో సన్నిహితమైన సంబంధం ఉండటం వల్ల, పాము ఎప్పుడూ పక్రమమైన అంతిమ సంస్కారాన్ని పొందుతూ ఉంది. మనిషిని ఖననం చేసినట్లే అది కూడా ఖననం చేయబడుతుంది. అందువలన ఒక పాముని చంపడం అందే అది హత్యతో సమానం. అలాగే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. పాములెప్పుడూ నా చుట్టూ ఉంటాయి. నా తోటలో చాలా పాములున్నాయని, అది పాములతో నిండి ఉందని, మీకు విషయం తెలుసా! ప్రత్యేకించి అందర్నీ భయపెట్టే నా ఆప్తమిత్రుడి గురించి చాలామంది ప్రజలు ఫిర్యాదు చేస్తుంటారు. అతను చాలా పెద్దవాడు, ఎంతో అందంగా ఉంటాడు కాని ఎవ్వరూ అతని అందాన్ని గమనించడం లేదు. అందరూ అతనెంత పెద్దవాడు అనే విషయాన్నే పట్టించుకుంటారు(నవ్వులు).

జీవరాశి అభివృద్ధికి హేతువు
పాశ్చాత్య దేశాల్లో పాముల గురించి వ్యతిరేక భావం ఉందంటే అది కేవలం క్రైస్తవ మత సాంప్రదాయంలో కొన్ని నిర్దిష్టమైన అంశాలలో, పాముల గురించి చాలా అవాస్తవంగా వివరించటం మూలానే ఒకవేళ పాముని దెయ్యానికి ప్రతినిధిగా, అదొక వ్యతిరేక శక్తిగా వాళ్లు భావిస్తున్నారంటే-అందుకు కారణం, పాము ఈవ్‌ని యాపిల్ పండు తినేందుకు ప్రోత్సహించిన కారణం అయి ఉండవచ్చు. ఈ భూమి మీద ఇద్దరు మూర్ఖులు ఉన్నారు..ఆడమ్, ఈవ్‌లు. వాళ్లకి కనీసం తమకి తాము ఏమి చేసుకోవాలో కూడా తెలియదు. వారికి జ్ఞానం, స్వేచ్ఛలు లేవు. అట్టి పరిస్థితులలో జీవం కొనసాగే అవకాశమే లేదు.

అప్పుడు పాము అక్కడ ప్రవేశించి ఈవ్‌ని ప్రలోభపరచి యాపిల్ తినేలా చేసి ఈ భూమి మీద జీవం కొనసాగేలా చేసింది. మీరు ఈ భూమి మీద జీవరాశి దేవుని సృష్టి అని నమ్ముతున్నట్లైతే పాము ఈ భూమి మీద జీవరాశి అభివృద్ధికి దేవుని ప్రతినిధి అని తెలిస్తే, మీరు ఇప్పుడు పాము దేవుని ప్రతినిధా లేక దెయ్యం ప్రతినిధా చెప్పండి?(నవ్వులు). అది తప్పక దేవుడి ప్రతినిధే! అవునా, కాదా? ఈ భూమి మీద జీవరాశి పెంపొందటానికి తోడ్పడినది కచ్ఛితంగా దేవుడి ప్రతినిధే. జీవన ప్రక్రియకు పూర్తిగా వ్యతిరేకులుగా ఉన్నవారు, జీవన ప్రక్రియ గురించిన కనీస అవగాహన కూడా లేని మూర్ఖులు-ప్రాథమిక శరీర నిర్మాణం గురించి కూడా తెలియనటువంటి వారు, భూమి మీద జీవకోటి అభివృద్ధి చెందడానికి తోడ్పడిన పాముని దెయ్యం ప్రతినిధి అంటారు. నిజంగా జీవిస్తున్న ఎవరైనా, కచ్ఛితంగా పాముని దేవుడి ప్రతినిధిగానే గ్రహిస్తారు.

దేవుని ప్రతినిధి
ఇక్కడ ఈ సంస్కృతిలో దాన్ని మేము ఒక దేవుని ప్రతినిధిగానే చూస్తాం. శివుడంతటివాడే పాముల్ని ధరించాడు, పాదాల వద్ద కాదు తన తలపై. జీవ ఉద్భవ ప్రక్రియలో, మానవ జీవితంలో, మానవ అవకాశాలలో పాము చాలా ప్రాధాన్యతను కలిగి ఉంది. అందుకే ఈ సంస్కృతిలో మీరు ఏ గుడికి వెళ్లినా అక్కడ పాములుంటాయి. నాకు తెలిసినంత వరకూ ఒక పామైనా లేని గుడి అంటూ ఉండదు. ప్రతి గుడిలో ఎక్కడో ఒక చోట ఒక చిన్న పామైనా ఉంటుంది. కాని అన్ని ప్రాచీన దేవాలయాల్లో పాములున్నాయి.

కొత్తగా కట్టిన కొన్ని దేవాలయాలు షాపింగ్ కాంప్లెక్సులులా ఉన్నాయి. బహుశా అవి దానికే ఉద్దేశించినవేమో! అక్కడ పాములు ఉండకపోవచ్చు, కాని మీరు ఏ పురాతన దేవాలయాన్ని సందర్శించినా అక్కడ పాముల కోసం ప్రత్యేకంగా ఓ స్థానం ఉంటుంది. ఎందుకంటే అది జీవ పరిణామక్రమంలో చాలా ముఖ్యమైన మలుపు, అది జీవం ప్రేరేపణ చేసింది. మనకిక్కడ ఈషాలో అది చాలా ప్రధానమైంది. వాటిలో కొన్నిటి గురించి మీకు తెలుసు. కొన్నిటి గురించి మీరు ఇంకా తెలుసుకోవాలి. పాముల గురించి ఎక్కువగా మాట్లాడితే ప్రజలు అపార్థం చేసుకుంటారు. నాకయితే అవి ఎప్పుడూ నా చుట్టూ ఉంటేనే ఇష్టం. వాటితో ఉండటం నాకు చాలా హాయిగా ఉంటుంది. ం సద్గురు

From → Uncategorized

వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: