Skip to content

అమ్మ మాట

అమ్మ మాట

* అందరిలోనూ దైవాన్ని చూడగలిగితే అదే దివ్యత్వం.

* అన్నిటినీ ప్రేమించగలిగితే అదే జ్ఞానస్పర్శ.

* స్వార్థం, సంకుచితం ఎరుగని సువిశాల భూమిక ప్రేమ.

* మోక్షానికి అందరూ అర్హులే. కాకపోతే సాధనలో అర్హతను సాధించుకోవాలి.

* అంతా బ్రహ్మమైనపుడు అందరూ బ్రహ్మమే.

* వెలుగు మూలం వెలుగే. ఆ వెలుగు బయటా ఉన్నది, లోపలా ఉన్నది.

* దైవం, ప్రకృతి, పదార్థం, శక్తి… ఏ పేరుతో అనుకున్నా ఉన్నదొకటే.

*తాత, తండ్రి, కొడుకు, భర్త, యజమాని, గురువు, శిష్యుడు, పరిచారకుడు, అన్న, మామ, వంటివి పురుషుడి పరంగా, తల్లి, చెల్లి, కూతురు…వంటివి స్త్రీపరంగా అనేక స్థితులున్నా ఉన్న వ్యక్తి ఒక్కరే! తనువుతో ఏర్పడేవన్నీ బాంధవ్యాలు, అనుబంధాలు. తనువులోనే తెల్లవారే కల్లలు. దీనంతటినీ పరచుకుని ఉన్నది ఆత్మే.

* ఆత్మైక స్థితిని అనుభవించాలేగానీ, ఆవిష్కరించలేం.

* దర్శించగలిగితే ఆత్మ తప్ప అన్యంలేదు. అంతా అదే అయినపుడు మరొకటంటూ లేదు.

* కనబడుతున్న దానిని ప్రపంచమని, కనబడనిదాన్ని దైవమనీ అంటున్నాం. కానీ వున్నదంతా దైవమే.

* తాడుకి రెండు కొసలున్నట్లు, విజ్ఞానం, ప్రజ్ఞానం ఉన్నయ్. రెండిటినీ సమన్వయం చేసుకోవటమే సాధన.

* కదిలేదంతా కనపడుతున్నది. కదిలించేది కనబడటం లేదు. కనబడటం లేదు కనుక, అది లేదనుకోరాదు.

కనబడుతున్నదంతా శాశ్వతంగా ఉంటుందని అనుకోవటం అజ్ఞానమే.

* కడలిలోనే కెరటాలున్నయ్. సముద్రానికి అవతల సముద్రం లేదు. అలలు, తుప్పరలు సముద్రం కంటే భిన్నం కావు.

స్థితి, గతి, రూపం, నామం భిన్నంగా కనబడుతున్నయ్. అంతే!

* అసమత్వమే సృష్టి. వైరుధ్యమే ప్రకృతి. ఈ సత్యాన్ని గ్రహించగలిగితే, యాతనలుండవు.

* జరుగుతున్న దాన్ని అంగీకరించటం, సాక్షిగా ఉండగలగటం స్థిమితాన్నిస్తుంది. ఎదురీదటంలో అహంకారం, అలసట, నిర్వేదం, శ్రమ ఒదిగి ఉన్నయ్.

* ప్రతిఘటనలో దాగిన ఘటనను స్పష్టంగా అనుభవించగలిగితే, శాంతి సైతం కైవసమౌతుంది. కావలసిందల్లా హేతువును గుర్తించగలగటం.

* అహం స్ఫురణను పెంచుకోగలిగితే అహంకారం నశిస్తుంది.

* దేన్నో ఆశిస్తూ ధ్యానించకు. అంతరంగంలో శూన్యస్థితిని, అంటే నిర్వికార స్థితిని అనుభవించటం కోసం ధ్యానించాలి. అదే అసలైన పూర్ణ స్థితి.

* తృప్తే సంపద. తృప్తే ఆనందం. తృప్తే శాంతి.

* పరిస్థితులు మంచివి కావు. చెడ్డవీ కావు. అర్థం చేసుకోగలిగితే, అవి గురు స్వరూపాలే. వాస్తవాన్ని ఆవిష్కరించే అవకాశాలవి.

* అధ్యాత్మ భావంతో పెనవేసుకున్న వినయమే నిజమైన సాధన.

* పడిపోతే ఏడవటం చూస్తాం. ఆటలో పడిపోతే హాయిగా నవ్వుతూ ఆట మొదలుపెట్టడం సహజంగా జరిగిపోతుంది. జీవితాన్ని ఆటగా అనుకోగలిగితే కిందపడ్డా ఆనందమే.

* అన్నిటిలో ఏకత్వాన్ని చూడగలగటమే పరమానందం.

* పుట్టుకకీ, మరణానికి మధ్య తేడా లేదనుకోవటమే అమృతత్వం.

*ఏది సాధ్యమో అదే సాధన. శోధిస్తున్నంత సేపూ అసాధ్యంగా కనిపిస్తున్నది, శోధన పూర్తై ఫలితం దొరికినపుడు కలిగే పులకింతే ఒక ఆనందరేఖ.

* మతాలు సూచించిన మార్గాలన్నీ మంచివే. అర్థం చేసుకోవటం లోనూ, ఆచరించటంలోనూ ఉన్న అస్పష్టత వల్ల, అసమగ్రత వల్ల భేదం ఉన్నట్లనిపిస్తుంది.

* మతానికి ధర్మం ఉన్నది. ధర్మం మతాతీతం, దేశకాలాతీతం. ధర్మంలోనే మిగిలిన మూడు పురుషార్థాలు ఇమిడి ఉన్నయ్.

* జీవుడి దంతా ప్రయత్నమే. అది కనిపిస్తుంది. దైవానిది ప్రేరణ. అది కనిపించదు. కానీ అదే సత్యం. * సాధనలో ఒక స్థాయిని అందుకున్న తరుణంలో సాధకుడు తిరిగి వెనక్కి చూడకూడదు. ప్రాపంచిక ఆకర్షణలు ఎన్ని ఎదురైనా పతనం చెందకూడదు. అంతరంగ దర్శనానికై తీవ్ర ప్రయత్నం చేయాలి.

* స్వార్థం మానవ ప్రవృత్తిలో ఒక భాగం. అధిగమించే ప్రయత్నమే సాధన. దాటగలిగితే మానవుడు తనలోని మాధవత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోగలడు.

*అధ్యాత్మ సాధన మన చేతుల్లోనే ఉన్నది. చేయగలిగినంత మనం సాధన చేయగలం. చేయలేనిది చేస్తామనటం అహంకారమే. * అరిషడ్వర్గాలను జయించటం మాత్రమే కాదు. ఆరు రకాల వికారాలను సాధన ద్వారా, అనుభవం ద్వారా రూపాంతరీకరణం చేసుకోవాలి. కాలగమనంలో సాధనా తీవ్రతతో అవే తమ ప్రభావాన్ని తగ్గించుకుని, సరైన సమయంలో సమశక్తిగా అభివ్యక్తమౌతయ్. వికృతి నుండి ప్రకృతి వైపు మరలటమే జరగవలసింది.

* విధి ఉన్నది. దాన్ని దాని పనిచెయ్యనిద్దాం. మన ప్రవృత్తి ద్వారా, జీవన విధానం ద్వారా, జీవన దృక్పథం ద్వారా, జీవనశైలి ద్వారా విధిని అనుసరిస్తూ అంగీకరించటమే మన విధి. కావలసిందల్లా సమన్వయమే, సంఘర్షణ కాదు.

* సర్వాత్మ భావనే, సర్వేశ్వర భావన!

ఏది ఎట్లా జరగాలో అట్లాగే జరుగుతుంది!

అన్ని పరిస్థితులనూ ఆకళింపు చేసుకోవాలి.

దైవం పట్ల అచంచల విశ్వాసంతో జీవించాలి.

అన్ని రూపాలు ఆయనవే. అన్ని పేర్లు ఆయనవే.

అన్ని గుణాలు ఆయనవే.

భగవంతుడంటే ప్రత్యేకం కాదు. ఉన్నదంతా దైవమే!

– వి.యస్.ఆర్. మూర్తి
ఆధ్యాత్మిక శాస్త్రవేత్త

ప్రకటనలు

"దరిశి" పట్టణం లో శనివారం నిర్వహించిన సాముహిక హనుమదభిషేకములు

 ఈ రోజు  దరిశి పట్టణంలో  హనుమత్ స్వామికి  సామూహికంగా అభిషేకములు నిర్వహించబడ్డాయి . స్థానిక హనుమత్ సేవాసమితి వారు గ్రామక్షేమమునకై  నిర్వహించిన ఈ కార్యక్రమం లో గ్రామస్థులంతా భారీగాతరలి వచ్చి భక్తిశ్రద్దలతో పాల్గొన్నారు. ఈసందర్భంగా  అష్టోత్తరశతకలశములతో  స్వామికి  ప్రత్యేక అబిషేకములు చేశారు. పంచామృతములతో ప్రత్యేకించి క్షీరాభిషేకములలో ఓలలాడిన స్వామి కన్నులవిందుగా దర్శనమిచ్చారు.   భక్తబృందాలతో  నూటాఎనిమిది సార్లు సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం సాగించగా  అర్చకులు రుద్రసూక్త,మన్యసూక్తములతో స్వామిని అభిషేకించారు.     శ్రీవేంకటెశ్వర జగన్మాత పీఠం తరపున   నేను ఈకార్యక్రమ  రూపకల్పన చేసి  సేవలో పాల్గొన్నాను . వచ్చినభక్తులందరికీ హనుమద్రక్షలు చాలీసా ప్రతులను ప్రసాదములుగా వితరణచేయటం జరిగింది .ఉదయం ఆరుగటం లనుండి ప్రారంభమై మధ్యాహ్నం ఒంటిగంట వరకు సాగిన  అభిషేకములలో పట్టణవాసులంతా, విద్యార్థులు మహిళలు  విశేషంగా తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు.
జైశ్రీరాం

 స్వామికి క్షీరాభిషేకములు

 హనుమాన్ చాలీసా పారాయణములు

 బుజ్జాయి తాళం

క్యాన్సర్ కు అద్భుత ఔషధం నిమ్మకాయ

క్యాన్సర్ కు అద్భుత ఔషధం నిమ్మకాయ

డా. విప్లాపురి, ఆర్.ఐ.ఏ. 
Cunsultant – RIA, Department of Lab Medicine, 
P.D. Hinduja Hospital, Mumbai

 

క్యాన్సర్ అని నిర్ధారణ అయిందంటే ఇక ‘ప్రాణం క్యాన్సల్’ అనే భావన ఉంది. క్యాన్సర్ వ్యాధి ఏ మాత్రం ముదిరినా బ్రతకటం కష్టం. ముదరకముందే నిర్ధారణ జరిగి తగిన చికిత్స లభిస్తేనే బ్రతికే అవకాశముంది. చికిత్సలో కీమోథెరపీ ముఖ్యమైనది. ఈ కీమోథెరపీ కంటే 10వేల రెట్లు గుణాన్ని నిమ్మకాయ ఇస్తుందని వైద్య పరిశోధనలలో తేలింది. నమ్మశక్యం గాకున్నా నిమ్మకాయ ద్వారా క్యాన్సరు నయమవుతుందనేది సత్యం. నిమ్మరసం కలిపిన నీరు త్రాగితే చాలు, క్యాన్సరుకు దూరంగా ఉండవచ్చు. క్యాన్సరు వ్యాధిగ్రస్తులకు కూడా నిమ్మరసం ద్వారా వ్యాధి నయం చేయవచ్చు. ఈ వ్యాస అనువాదకర్త యొక్క బంధువుకు వరంగల్ ఎం.జి.ఎం.ఆసుపత్రిలో తుంటి ఎముకకు శస్త్రచికిత్స జరిగింది. చికిత్స విజయవంతమై రోగి బాగయినాడు. శస్త్రచికిత్స చేసిన డాక్టరు “ఈ పేషంటుకు క్యాన్సరు కూడా ఉంది. దానికి కూడా శస్త్రచికిత్స త్వరలో చేయించుకోమని, లేకుంటే ఏడాదికంటే ఎక్కువకాలం బ్రతకడని” రోగి బంధువు (వ్యాసకర్తతో) తో చెప్పాడు. ఆ బంధువు ఈ వార్తను ఎవరికీ చెప్పలేదు. ఇది జరిగి 25 సంవత్సరాలయింది. ఆ రోగి ఒక వ్యవసాయదారుడు. అతను ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. తర్వాత ఆరా తీస్తే తెలిసిన విషయం ఏమిటంటే ఆయనకు (రోగికి) యుక్త వయసు నుండే ప్రతి నిత్యం నిమ్మకాయ ముక్కను చప్పరించే అలవాటు ఉందని తెలిసింది. ఇంట్లో నిమ్మచెట్లు, కాయలు ఏడాది పొడవునా లభిస్తాయి. ఇప్పుడా వ్యక్తికి 75 ఏళ్ల వయసు. చక్కటి ఆరోగ్యంతో ఇంకా వ్యవసాయ పనులు చేస్తూనే ఉన్నాడు. నిమ్మకాయ ఆయనను బ్రతికించిందని డాక్టర్లతో సహా చాలామంది చెపుతున్నారు.

నిమ్మకాయను, నిమ్మరసాన్ని ఏ రకంగా వాడినా అద్భుతమైన ప్రయోజనం కలిగిస్తున్నాయి. నిమ్మకాయను లేదా పండు నుండి 2-3 నిమ్మ తొనలను (Thin slices) తాగే నీళ్ళలో వేసుకొని ఆ నీటిని దినమంతా త్రాగడం అలవాటు చేసుకోవచ్చు. లేదా ఒక నిమ్మకాయ రసం ఓ బిందెడు నీళ్ళలో కలుపుకొని రోజూ త్రాగటం అలవాటు చేసుకోవచ్చు. ఇది క్యాన్సరును అద్భుతంగా నిరోధిస్తుంది. కీమోథెరపీ కంటే పదివేల రెట్లు శక్తివంతమైన ఔషధమిది. దీనివల్ల శరీరంపై ఇతర దుష్ప్రభావాలు (Side Effects) ఏవీ ఉండవు. ఇప్పుడు క్యాన్సరు చికిత్స శరీరంపై ఎన్నెన్నో దుష్ప్రభావాలను కల్గించడం అందరికీ తెలుసు.

నిమ్మకాయ గుణాన్ని ప్రపంచంలోని అత్యంత పెద్ద ఔషధ కంపెనీ (Institute of Health Sciences, 819, N.L.I.C., Cause Street, Baltimore, Md 1201) నిర్ధారించింది. ఈ ఔషధ కంపెనీ వారు 1970 నుండి పరిశోధనలు జరుపుతున్నారు. After more than 20 Laboratory tests జరిపిన పిదప వారీ నిర్ధారణకు వచ్చారు. క్రింది ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. 

It destroys the malignant cells in 12 Cancers including Colon, Breast, Prostate, Lung and Pancreas. The Compounds of this tree showed 10,000 times better than the product Adriamycin, a drug normally used Chemotherapeutic in the world, slowing the growth of Cancer cells. And what is even more astonishing : This type of therapy with lemon extract only destroys malignant cancer cells and it does not affect healthy cells. 
ఇదీ పై ఔషధ కంపెనీవారి నిర్ధారణ. మనం మన తోటివారికి దీని తెలియచేయటం ద్వారా క్యాన్సరు వ్యాధి రహిత ప్రపంచాన్ని నిర్మాణం చేద్దాం.

[లోకితం  పత్రికుండి]

కార్తీకశోభ

శ్రీ వేంకటేశ్వర జగన్మాత పీఠంలో  కార్తీకపౌర్ణమి పూజలు

జ్వాలాతోరణం

జ్యోతిర్లింగార్చన

మహాకాలుని దర్శనం

 మహాకాలేశ్వర్    ….ఉజ్జయిని

 మహాకాలుడు

 మహాకాల హర నమశ్శివాయ

 భస్మహారతి

 మహాకాళి  [శక్తిపీఠం]

 మహాకాళి మందిర్

 కాలభైరవస్వామి

 భతృహరి గుహ

 సాందీప గురుకులం 

 మహాకాలుని మందిరం

ఓంకారేశ్వర నమశ్శివాయ……

 ఓంకారేశ్వర జ్యోతిర్లింగం

 మామలేశ్వరం

 మామలేశ్వరుడు

 తల్లి నర్మదాదేవి

సుధామపూరి [పోరుబందర్] వెళ్ళి మహాత్ముని ఇంటిని చూసొద్దాం .

 పోరుబందర్ లో కుచేలుని  ఆలయం

 మహాత్మాగాంధీ ఇల్లు “కీర్తిమందిర్”

 మొదటి అంతస్తు కు మెట్లు

 గాంధీజీ తల్లిదండ్రులు